రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి సెలవులకు గాను మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ASHA వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మూడోది గ్రాట్యుటీ చెల్లింపును సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే రూ.5,000 చెల్లింపు చేయనుంది. గరిష్టంగా మొత్తం 1,50,000 వరకు చెల్లింపు చేయనుంది. రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.