గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు

పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 13 Oct 2025 3:39 PM IST

Andrapradesh, Ap Government, Animal Husbandry Dairy Development & Fisheries Department, lab technicians

గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు

అమరావతి: పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి సేవలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో ఏడాది పాటు సేవలు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ స్థాయి, జంతు వ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలల్లో పని చేస్తోన్న ల్యాబ్ టెక్నీషియన్లు ఈ కొనసాగింపునకు అర్హులు అని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story