అమరావతి: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా, ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ కీలక డెసిషన్ తీసుకుంది. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. అటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అటు రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్య కళాశాలను వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్స్ కల్పిస్తామన్నారు. వైజాగ్, కాకినాడలలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే వాటిలో ఆయుర్వేదం, యునాని, హోమియో వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు.