గెస్ట్‌ లెక్చరర్లకు గుడ్‌న్యూస్‌.. సర్వీసు పొడిగింపు

గెస్టు లెక్చరర్లకు గుడ్‌న్యూస్‌ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.

By అంజి
Published on : 25 April 2025 6:41 AM IST

AP government, guest lecturers, APnews

గెస్ట్‌ లెక్చరర్లకు గుడ్‌న్యూస్‌.. సర్వీసు పొడిగింపు

అమరావతి: గెస్టు లెక్చరర్లకు గుడ్‌న్యూస్‌ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. వీరి సర్వీసును 2025 - 2026 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 1 వరకు వీరి సేవలను నిలిపివేశారు. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ హాల్‌టికెట్లను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. హాల్‌టికెట్లను https://polycetap.nic.inలో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 30వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.

Next Story