దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.

By -  అంజి
Published on : 16 Sept 2025 10:28 AM IST

AP government, Dussehra holidays, APnews

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా.. 2025 దసరా సెలవుల అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బుధవారం, సెప్టెంబర్ 24, 2025 నుండి గురువారం, అక్టోబర్ 2, 2025 వరకు మూసివేయబడతాయి. విద్యార్థులకు మొత్తం తొమ్మిది రోజులు సెలవులు లభిస్తాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, శుక్రవారం, అక్టోబర్ 3, 2025న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత అతిపెద్ద పండుగ దసరా. ఈ పండును తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అటు తెలంగాణలో కూడా 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అధికారికంగా మొత్తం 13 రోజులు పండగ సెలవులిచ్చారు. 4న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అటు దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై.. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది.

Next Story