Andrapradesh: మహిళలకు ఫ్రీ జర్నీపై మరో గుడ్‌న్యూస్
స్త్రీ శక్తి పథకంపై మరో గుడ్‌న్యూస్ చెప్పింది
By Knakam Karthik
Andrapradesh: మహిళలకు ఫ్రీ జర్నీపై మరో గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్త్రీ శక్తి పథకంపై మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో.. గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు. అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ (గ్రౌండ్ బుకింగ్) చేస్తారు. ఇటువంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు. అలానే సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సులకు టోల్ ఫీజు మినహాయించాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకు లేఖ రాశారు. రాష్ట్రంలో తిరుమల మినహా మిగతా 39 ఘాట్ రోడ్లపై తిరిగే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.