గణేష్‌కు 30 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో స్మగ్లర్ల వాహనం ఢీకొని కానిస్టేబుల్ గణేష్ (32) మృతి చెందాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Feb 2024 8:15 PM IST
గణేష్‌కు 30 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో స్మగ్లర్ల వాహనం ఢీకొని కానిస్టేబుల్ గణేష్ (32) మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దులో ఉన్న గొల్లపల్లి చెరువు వద్ద కాపుకాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేశ్ ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి, పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేశ్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.

నిందితులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. కారులో లభించిన 7 దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి ఎస్పీలు కృష్ణారావు, శ్రీనివాస్ చేరుకుని పతిస్థితి సమీక్షించారు. ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గణేష్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గణేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రూ. 30లక్షలు ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Next Story