AP: రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 21 Nov 2023 7:45 AM ISTAP: రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగు నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే సరఫరా చేస్తుండగా.. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఇవ్వనుంది. భవిష్యత్తులో కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేసి.. ప్రాసెసింగ్ చేసి, రేషన్ ద్వారా కేజీ రూ.67కే అందించనుంది. మరోవైపు హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ కూడా ఇచ్చింది.
దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకు అందుతోంది. దీంతో డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ కందిపప్పు పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ తీసుకునే వారి శాతం 90కిపైగా చేరింది. రేషన్ షాపుల్లో ఇస్తున్న ఫోర్డిఫైడ్ బియ్యం మార్కెట్‌లో దొరికే సన్న బియ్యం మాదిరే ఉండటంతో.. ప్రజలు వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. గడిచిన 3 నెలల నుంచి ప్రభుత్వం ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని రూ.16కే సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్‌లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.