మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?

ఏపీ ఫైబర్‌నెట్‌ నష్టాల్లో ఉందని, పతనం అంచున ఉందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి వెల్లడించారు.

By Medi Samrat  Published on  19 Dec 2024 3:45 PM GMT
మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?

ఏపీ ఫైబర్‌నెట్‌ నష్టాల్లో ఉందని, పతనం అంచున ఉందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ‘వ్యూహం’ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు అధికారులు అక్రమంగా రూ.2.10 కోట్లు చెల్లించారని ఆరోపించారు. అమరావతిలో ఆయ‌న‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు 2016లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి నాశనం చేసిందని అన్నారు.

2019 నాటికి 24,000 కిలోమీటర్ల మేర కేబుల్స్‌ వేసి 10 లక్షలకు పైగా కనెక్షన్లు ప్రజలకు అందించారు. ఇప్పుడు ఆ సంఖ్య 5 లక్షలకు తగ్గిపోయిందని తెలిపారు. ఏపీ ఫైబర్‌నెట్‌లో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లను వైఎస్ఆర్సీ ప్రభుత్వం వేధించింది.. సమగ్ర విచారణ జరిపి అప్పటి ఎండీ మధుసూదన్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేతలు అక్రమాస్తులు దాచిపెట్టేందుకు కీలక ఫైళ్లు, రిజిస్టర్లను తారుమారు చేశారని ఆరోపించారు. కొన్ని కీలక పత్రాలు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి తరలిపోయాయని అన్నారు.

Next Story