కేబుల్ ఆపరేటర్లపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్ల పెనాల్టీలు వేశారని.. వాటిని నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మాఫీ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. కేబుల్ ఆపరేటర్లపై భారీ మొత్తంలో జరిమానాలు విధించడం వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అద్దెకు సెట్ టాప్ బాక్సులు ఇచ్చారని, ప్రతి నెల కనెక్షన్ కు రూ.59 చొప్పున అక్రమంగా రెంట్ వసూలు చేశారని ఆరోపించారు. ఈ రెంట్లను కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు
ప్రస్తుతం ఫైబర్ నెట్ ప్లాన్స్ ను సమీక్షిస్తున్నామని చెప్పారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ ను ప్రజలకు అందిస్తామని అన్నారు. పేదల కోసం ప్రత్యేకంగా ఫైబర్ నెట్ బేసిక్ ప్యాక్ ను ప్రవేశపెడామన్నారు. ఫైబర్ నెట్ బాక్సుల సరఫరాకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావొచ్చని జీవీ రెడ్డి కోరారు.