అక్రమాస్తుల కేసులో ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది

By -  Knakam Karthik
Published on : 8 April 2026 8:00 PM IST

AndhraPradesh, ACB, Corruption, EndowmentsDepartment, DisproportionateAssets, Vijayawada

అక్రమాస్తుల కేసులో ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. మంగళవారం తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నం సహా పలు చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ దాడుల్లో విశాఖలో ఫ్లాట్, కుంచనపల్లిలో జీ+2 భవనం, 776 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, నగదు, బ్యాంకు బ్యాలెన్స్ మరియు విలాసవంతమైన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2020లో ఏపీపీఎస్సీ ద్వారా ఈమె నియామకం జరగగా, విధుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2024 జూలై నుండి 2026 మార్చి వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసినా, ఆమె నియామక ప్రక్రియపై కూడా ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను కూడా సోదా చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Next Story