నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. విద్యార్థులుకు రాగి జావా నిలిపివేశామంటూ వస్తున్న ప్రచారం తప్పు అని, తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగిజావాకు బదులు చిక్కీలు ఇస్తున్నామని మంత్ర బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని.. ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామని.. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. విశాఖ పట్నం పరిపాలన రాజధాని అనేదే మా పాలసీ. మాకు డైవెర్షన్ చేయ్యాల్సిన అవసరం లేదని అన్నారు.