వాట్సాప్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ http:// cse.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

By Medi Samrat
Published on : 31 May 2025 4:30 PM IST

వాట్సాప్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ http:// cse.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్య‌ర్థుల‌కు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. దీనికోసం అభ్య‌ర్థులు 95523 00009కు మెసేజ్ చేయాలి.

డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు విద్యా, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ ప‌ట్ల త‌మ నియ‌బ‌ద్ధ‌త నెర‌వేరింద‌ని, డీఎస్సీలో అభ్య‌ర్థులు ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చాల‌ని సూచించారు. మీరు మీ వంతు కృషి చేసి అద్భుతమైన ఫ‌లితాల‌తో బయటకు రావాలని కోరుకుంటున్నానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచ‌ర్‌ ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భర్తీ చేయ‌నుంది. డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story