డీఎస్సీ రాస్తున్నారా..? మీకో గుడ్ న్యూస్..!
6,100 టీచర్ పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ కూడా విడుదలైంది
By Medi Samrat Published on 21 Feb 2024 5:27 PM IST6,100 టీచర్ పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడువు ముగియనుంది. ఆ గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్టు తెలిపింది. https://apdsc.apcfss.in/ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తును ఎడిట్ చేసుకుని.. తప్పులను సరిచేసుకోవచ్చని సూచించింది. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఎడిట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా పేరు సవరించుకోవడం కుదరదు. అవి తప్ప మిగతా కాలమ్స్ ను సవరించుకోవచ్చు. అభ్యర్థి పేరు దరఖాస్తులో తప్పుగా పేర్కొంటే, పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్ లో సంతకం చేసేటప్పుడు సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇక ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది. కొన్ని పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బీఎడ్ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే.. బోధనకు అనుమతిస్తామన్నారు. దీనిపై ఇవాళ విచారణలో ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం విన్న హైకోర్టు.. సంతృప్తి చెందలేదు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొన్న సదరు నిబంధనపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధు