అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు నిర్వహణ శాఖ సిద్ధమైంది. సందేశాన్ని చూసి ఓకే బటన్ నొక్క వరకు ఫోన్ మోగేలా కొత్తగా ఏర్పాటు చేసింది. సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని ఎస్‌డీఎంఏ సూచించింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నేడు శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం-22, పార్వతీపురంమన్యం -12, అల్లూరి సీతరామరాజు-9, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు-5, ఎన్టీఆర్ -3 మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్‌డీఎంఏ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ప్రకాశం(D)నందనమారెళ్ళలో 42.4°C, నెల్లూరు(D)కొమ్మిపాడులో 42.2°C, వైఎస్సార్ (D) ఒంటిమిట్టలో 42.1°C,కర్నూలులో 41.7°C అలాగే ఇవాళ 105 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందన్నారు.