అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. ఆతరువాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న "సెన్యార్" తుపాను తీరం దాటిందని తెలిపింది.