మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు చెప్పాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం ఇస్తారా? అది ప్రజలు ఇవ్వాలని ఆయన రఘురామకృష్ణ అన్నారు. శాసనసభ్యుడు ఎవరైనా 60 రోజుల పాటు సరైన లీవ్ అడగకుండా సభకు హాజరుకాకుంటే అనర్హత వర్తిస్తుందని, అప్పుడు పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ తెలిపారు.
తనపై కస్టోడియల్ వేధింపుల కేసులో ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని రఘురామకృష్ణరాజు అన్నారు. కస్టోడియల్ టార్చర్‌ల సునీల్ కుమార్ పాత్ర స్పష్టంగా ఉందని ఆరోపించారు. దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. గతంలో ఎన్నో ఫిర్యాదులు చేశానని, సమాజాన్ని మతాలు, కులాల ఆధారంగా విధంగా కొందరు మాట్లాడారని అన్నారు. తాను ఒక బాధ్యుడిగానే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అతి తెలివి తేటలు ఉపయోగించి యూట్యూబ్‌లో వీడియోలు తొలగించారని అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇస్తుఏ దానిపై ఐపీఎస్ అధికారి ఇష్టానుసారంగా కామెంట్లు చేశాడని చెప్పారు. సునీల్ కుమార్‌ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు రఘురామకృష్ణరాజు అన్నారు. తన కస్టోడియల్ టార్చర్‌పై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.