ఏపీ లో కర్ఫ్యూ వేళలు సడలింపు

AP Curfew Timings Changed. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది.

By Medi Samrat  Published on  18 Jun 2021 7:48 AM GMT
ఏపీ లో కర్ఫ్యూ వేళలు సడలింపు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది. జూన్‌ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది. సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉండనుందని ప్రభుత్వం పేర్కొంది.

తూర్పుగోదావ‌రి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్ర‌మే సడలింపు ఇచ్చింది ప్ర‌భుత్వం. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందునే ఈ జిల్లాలో స‌డ‌లింపులు పాత‌వే అమ‌లుచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ప్రభుత్వ కార్యాలయాలు రెగ్యులర్‌ టైమింగ్స్ లో అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేశారు. ఈ మేర‌కు కోవిడ్‌పై సీఎం సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it