పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
AP CM Jagan Sensational Comments on Pawan Kalyan and Chandrababu. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
By అంజి
ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓ నాయకుడు బహిరంగంగా తిట్టు తిట్టినది అందరూ చూశారన్నారు. ఇలాంటి నాయకులు ఉండటం సిగ్గు చేటన్నారు. దత్తపుత్రుడు, దత్తపుత్రుడి తండ్రి కలిసి మళ్లీ కుట్రలు చేసేందుకు రెడీ అయ్యారని, ఆ కుట్రలను, కుతంత్రాలను తిప్పి కొట్టేందుకు అందరూ రెడీగా ఉండాలని సీఎం జగన్ అన్నారు.
ఏవరికీ కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా.. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని తాము చెబుతూ ఉంటే.. మూడు పెళ్లిలు చేసుకోండి మేలు జరుగుతుందని, మీరూ చేసుకోండి అంటూ.. నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని.. ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులా మనకు దిశా నిర్ధేశం చేసేది అంటూ మండిపడ్డారు. మరో 19 నెలల్లో రాష్ట్ర ఎన్నికలు వస్తాయని.. ఒక్క జగన్‌ను కొట్టడానికి వీరంతా ఏకమై వస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది అన్నారు.
తాము ప్రజలకు మంచి చేస్తుంటే ఆ వెన్ను పాటు దారులకు నచ్చడం లేదని, అందుకే ఇలా దత్తపుత్రుడిని ముందుకు తోస్తున్నారని అన్నారు. ఆ వెన్నపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదని.. కానీ దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కుట్రలు చేస్తుండడం దారుణమని సీఎం జగన్ అన్నారు. వారిలా అందరూ అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి అని నిలదీశారు. ఇది ఒక మంచికి.. మోసానికి జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధంలో మీరంతా అండగా ఉండాలని సీఎం జగన్ కోరారు.