ప్రధాని మోదీని క‌లిసిన సీఎం జ‌గ‌న్‌.. ఆ విష‌య‌మే చ‌ర్చించారా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని

By Medi Samrat  Published on  9 Feb 2024 2:46 PM IST
ప్రధాని మోదీని క‌లిసిన సీఎం జ‌గ‌న్‌.. ఆ విష‌య‌మే చ‌ర్చించారా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) కూడా సీఎం జగన్, ప్ర‌ధాని మోదీ భేటీపై ట్వీట్ చేసింది.

సీఎం జ‌గ‌న్‌ పార్లమెంటు కాంప్లెక్స్‌లో ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా సహా పెండింగ్ ప్రాజెక్టులు, డిమాండ్లపై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి 2019 ఎన్నికల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ హామీ ఇచ్చారు. చెప్పిన‌ట్లుగానే గతంలోనూ ఈ సమస్యపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అనేక సమావేశాలు నిర్వహించారు.

ష‌ర్మిల చేరిక‌తో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రాబల్యం పెరిగే అవ‌కాశం ఉండ‌టం.. తెలుగుదేశం పార్టీ (టిడిపి) బీజేపీతో జతకట్టే అవకాశం ఉన్నందున.. హోదా విష‌య‌మై జ‌గ‌న్‌ చివరి ప్రయత్నంగా మోదీని క‌ల‌వ‌డానికి దేశ రాజధానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Next Story