2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు

మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

By Knakam Karthik  Published on  12 March 2025 2:37 PM IST
Andrapradesh, Cm Chandrababu, Ap Assembly

2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు

మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడుతూ..మా ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశాం. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

జెండర్ ఈక్వాలిటీతో ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం రావాల్సిందే. ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో వివక్ష చూపిస్తూనే ఉన్నాం. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. మహిళా 33 రిజర్వేషన్ పాలసీతో ఎంపికైన అధికారి సూర్యకుమారి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మహిళలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో స్కూలుకు వెళ్లే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి ప్రోత్సహించాం. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లు మహిళలకే గర్వగారణమయ్యారు. మూడోవంతు రిజర్వేషన్ ప్రకారం 2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు. అలాగే మంత్రుల్లోనూ మూడోవంతు మహిళలే నియమితులవుతారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను కండక్టర్లుగా నియమించిన ఘనతా టీడీపీదే..అని సీఎం పేర్కొన్నారు.

Next Story