ముంబైకు సీఎం చంద్రబాబు

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం ముంబైకి వెళ్లారు.

By Medi Samrat  Published on  10 Oct 2024 2:30 PM IST
ముంబైకు సీఎం చంద్రబాబు

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం ముంబైకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిన ఆయన సాయంత్రం తిరిగి వస్తారు. రతన్ టాటా మృతికి సంతాపం తెలుపుతూ చంద్రబాబు నాయుడు ఆయనను బిజినెస్ టైటాన్ అని, నిజమైన మానవతావాది అని తెలిపారు.

3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు

Next Story