ఏపీలో గృహప్రవేశాల పండుగ..2.5 లక్షల ఇళ్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల పండుగ మొదలైంది

By -  Knakam Karthik
Published on : 30 March 2026 3:56 PM IST

Andrapradesh, AP Housing, TIDCO Houses, CM Chandrababu, AP Politics

ఏపీలో గృహప్రవేశాల పండుగ..2.5 లక్షల ఇళ్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల పండుగ మొదలైంది. గత ఏడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తాజాగా రెండో దశలో భాగంగా మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించింది.

ఇందులో లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.5 లక్షల సాధారణ ఇళ్లు ఉన్నాయి. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన ఈ గృహ సముదాయాల ద్వారా గత 21 నెలల్లో ప్రభుత్వం మొత్తం 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లయింది.

Next Story