నా విజన్‌ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు

తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 27 March 2025 7:23 AM IST

Andrapradesh, CM Chandrababu, Collectors Conferenece, Vision Document

నా విజన్‌ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు

తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో రెండ్రోజుల పాటు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో కంటే ఈ సారి భిన్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఈ సారి మిమ్మల్ని ప్రజెంట్ చేయమన్నాం. కలెక్టర్లు పరిష్కారానికి ఉన్నాం, సమస్యలు చెప్పడానికి కాదు. ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌లు, సెక్రటరీలతో కూర్చొని సమస్య పరిష్కారం చేయాలి. నాకు సొల్యూషన్ కావాలి, సాకులు కాదు.. అని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా వద్ద డబ్బు ఉండకపోవచ్చు ఢిల్లీతో మాట్లాడుతున్నాం. మొత్తం నాశనమైన ఆర్థిక వ్యవస్థకు జనసత్వాలు ఇస్తున్నాం. నేను నా జీవితంలో ఇన్నిసార్లు ప్రధాని, ఆర్థిక మంత్రిని కలవలేదు. అభివృద్ధి చేస్తూ, సంక్షేమం ఇవ్వాలి. కొంత అప్పులు చేసి సూపర్ సిక్స్‌లు ఇస్తున్నాం. రూ.9.70 లక్షల అప్పులు డేట్ సర్వీసింగ్ ఇవ్వాల్సింది ఉంది. క్రెడిబిలిటీ కాపాడుకుంటూ ఇన్‌ టైమ్‌లో అప్పులు చెల్లించాలి. పాత అప్పులు అన్నీ రీ స్వైపింగ్ చేస్తున్నాం. గతంలో నేను ఒక్కడినే పరిగెత్తే వాడిని, ఈ సారి అలా కాదు..నాతో పాటు మీరు పరిగెత్తాలి..అని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

నాలా ఫీజు అనేది పెద్ద సమస్య అయింది. దీని వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. అభివృద్ధికి ఆటంకంగా ఉండే చట్టాలు వద్దు. ఈ ఫీజును వేరే విధంగా సంపాదిస్తాం. జీరో పావర్టీ మన లక్ష్యం, హై నెట్‌వర్క్ ఉన్న వాళ్లు ముందుకు వచ్చేలా చూడాలి. నా విజన్ డాక్యుమెంట్‌ వల్ల తెలంగాణలో హైయస్ట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ పొందుతోంది. దీనికి 25 ఏళ్లు పట్టింది. మనం 23 ఏళ్లు పెట్టుకున్నాం. ఒరిజినల్ థింకింగ్ మీ వద్ద నుంచి రావాలి, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మీ ఆలోచనలు ఉండాలి. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఆ ప్రాజెక్టులను ఎగ్జిగ్యూట్ చేయాలి. ప్రపంచంలో ఇండియా, దేశంలో ఏపీ నెంబర్‌గా ఉండాలి.. అని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story