ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా ఈ నిషేధానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఈ వయోపరిమితిని 16 ఏళ్ల వరకు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారు సోషల్ మీడియా వ్యసనానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.