నేటి నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

By అంజి
Published on : 4 March 2024 6:10 AM IST

10th Public Examination, hall tickets, APnews, Students

నేటి నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. www.bse.ap.gov.inలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్‌ కోడ్‌ నంబర్‌తో, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్‌ టికెట్లను పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు.

అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాల, జిల్లా వివరాలు నమోదు చేసి, హాల్‌టికెట్లు పొందొచ్చని తెలిపారు. ఈ నెల 18వ తేదీ ప్రారంభం కానున్న పరీక్షలు.. ఈ నెల 30 తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 18 – ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 – థర్డ్ లాంగ్వేజ్

మార్చి 23 – గణితం

మార్చి 26 – ఫిజిక్స్

మార్చి 28 – బయాలజీ

మార్చి 30 – సోషల్ స్టడీస్

Next Story