కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి వర్గం

AP cabinet took key decisions. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం

By M.S.R  Published on  8 Feb 2023 7:30 PM IST
కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి వర్గం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది.

ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లకు కెబినెట్ ఆమోదం తెలిపింది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మంత్రి మండలి తీర్మానం ప్రకారం అనంతపురం జిల్లా రొళ్ళలో 250 మెగావాట్ల, కురుబపల్లి లో 251మెగావాట్ల, కమలపాడు, యాడికి లో 250 మెగావాట్లు, కర్నూల్ జిల్లాలో బేతంచర్ల లో 118 మెగావాట్లు, చిన్న కొడిమల్లిలో 251 మెగావాట్ల , మిట్టపల్లిలో 100 మెగావాట్ల, జాలదుర్గంలో 130 మెగావాట్ల, సత్యసాయి జిల్లాలో కొండాపురం లో 250 మెగావాట్ల, నంద్యాల జిల్లా నొస్సం లో 506 మెగావాట్ల చొప్పున విద్యుత్ ప్రోజెక్టుల ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ ప్రతిపాదనలకు మంత్రిమండ‌లి ఆమోద‌ముద్ర వేసింది. జెఎస్ డ‌బ్య్లు సంస్థకు మారిటెమ్ ద్వారా 250 ఏక‌రాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.


Next Story