ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Medi Samrat Published on 13 Sept 2023 2:15 PM ISTసీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ ఓ ప్రకటన విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుందని ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఈనెల 19 మధ్యాహ్నాం 12 గంటల లోపు కేబినెట్ బుక్ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.
అలాగే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 21 నుంచి ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరుగతాయని ప్రచారం జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.