మందుబాబులకు శుభవార్త.. నాణ్యమైన మద్యం.. రూ.99కే క్వార్టర్‌

కొత్త ఎక్సైజ్‌ పాలసీకి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మద్యం ధరలు, రిటైల్‌ వ్యాపారం, పన్నులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది.

By అంజి  Published on  19 Sept 2024 6:45 AM IST
AP Cabinet, new Excise Policy, APnews, Liquor

మందుబాబులకు శుభవార్త.. నాణ్యమైన మద్యం.. రూ.99కే క్వార్టర్‌

కొత్త ఎక్సైజ్‌ పాలసీకి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మద్యం ధరలు, రిటైల్‌ వ్యాపారం, పన్నులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. నాణ్యత గల మద్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. క్వార్టర్‌ రూ.99 కే అందించాలని రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. ఇది రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంఇ. రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం అంటే 340 దుకాణాలు కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది.

మద్యం షాపు కోసం దరఖాస్తు ఉసుం రూ.2 లక్షలుల. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్‌ ఫీజు రూ.50 నుంచి 85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో ప్రీమియం లిక్కర్‌ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు. ప్రాఫిట్‌ 20 శాతం మార్జిన్‌. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పని చేస్తున్న ఉద్యోగుల గురించి కేబినెట్‌ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదు. ప్రైవేట్‌ వారు వారిని తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు.

Next Story