వామ్మో.. పొత్తులపై పురంధేశ్వరి మాటలు విన్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తు కొనసాగుతూ ఉంది. ఈ కూటమి లోకి భారతీయ జనతా పార్టీని

By Medi Samrat  Published on  1 March 2024 2:38 PM GMT
వామ్మో.. పొత్తులపై పురంధేశ్వరి మాటలు విన్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తు కొనసాగుతూ ఉంది. ఈ కూటమి లోకి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని వెళ్ళడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలను చేశానని పలు సందర్భాల్లో అన్నారు. టీడీపీతో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధంగా లేకపోయినా.. తానే కలిసేలా చేశానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ పెద్దలతో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. పొత్తులపై ప్రకటన విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతూ ఉంది.

అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా అధిష్టానం అనే పదం గురించి తనకు పెద్దగా తెలియదని.. ఆ అధిష్టానం అంటే ఎవరో పవన్ కళ్యాణ్ నే అడగాలని పురందేశ్వరి అన్నారు. అధిష్ఠానం అని చెప్పింది పవన్ కళ్యాణ్ కాబట్టి.. అలాంటప్పుడు ఆయన్నే అడగాలి కదా అని మీడియాతో అన్నారు పురందేశ్వరి. 'పై నుంచి తిట్లు తింటున్నాను' అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారని మీడియా అడగ్గా.. దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి. తాను కాదని స్పష్టం చేశారు పురందేశ్వరి. ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా. పొత్తులపై తమ అగ్రనాయకత్వం క్లారిటీ ఇస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. అమరావతిలో మార్చి 2, 3 తేదీల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. ఈ సమావేశాలలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలు, జిల్లా ముఖ్య నేతలు పాల్గొననున్నారు.


Next Story