ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కేంద్రంలో 3.55 ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును డ్రోన్ల సాయంతో అధికారులు ధ్వంసం చేశారు.
3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫనీషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్టరల్ కెమేరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గూగుల్ సహాయం తీసుకొని సాటిలైట్ తో హాట్ స్పాట్ ల ద్వారా గంజాయి సాగు గుర్తించనుంది. గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా అధికారులు పేర్కొన్నారు.