నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది.
నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇప్పుడు ప్రవేశపెట్టలేమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.