నా కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నన్ను దారుణంగా చిత్రవద చేశారు.. చంపాలని చూశారు.. మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయని తెలిపారు. న్యాయం గెలుస్తుందని.. త్వరలో నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవారంత బయటకు వస్తారన్నారు. ఇప్పుడు నేను ఏపార్టీ పై విమర్శలు చేయను.. నా కేసు గురించి మాట్లాడే హక్కు నాకుంది అని అన్నారు.
శాసన సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను.. శాసన సభా సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయన్నారు. గుజరాత్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలు లేవు.. మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష హోదా ఉండదు.. జగన్ మోహన్ రెడ్డి సభకు వస్తే ఆయనకు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు జగన్ సభకు వచ్చి మాట్లాడొచ్చు.. జగన్ సభకు రావలన్నది ప్రజల ఆకాంక్ష.. ఆయన కాంక్ష తీరలేదని సభకు రావడం లేదన్నారు.