మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..!

AP Assembly budget session will start on 7th march.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు మూహూర్తం ఖ‌రారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 11:39 AM IST
మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు మూహూర్తం ఖ‌రారు అయిన‌ట్లుగా తెలుస్తోంది. మార్చి 7 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొత్తం 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని బావిస్తున్నారు. మార్చి 7న తొలి రోజు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మృతి ప‌ట్ల సంతాపం తెలప‌నున్నారు. అనంత‌రం స‌భ వాయిదా ప‌డ‌నుంది.

మార్చి 8న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. ఇక మార్చి 11 లేదా 14న రాష్ట్ర బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. కాగా..ఈ సారి 2.30 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్ ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సారి బ‌డ్జెట్‌లో విద్య‌, వైద్య రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నట్లు తెలుస్తోంది. అలాగే.. వ్యవసాయం, పాడి పరిశ్రమపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ ఇప్పటికే బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

ఇక ఈ సమావేశాల్లో కేవలం బడ్జెట్ మాత్ర‌మే కాకుండా కొన్ని కీలక బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. వీటిలో ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story