ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా, మరో ఇద్దరు మహిళా కూలీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అవినగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఈ సంఘటన జరిగింది. పొలంలో పనిచేస్తున్న జి కొండలమ్మ (30) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నరసింహపురం గ్రామ సమీపంలో కొంతమంది కూలీలు పొలాల్లో వరి నాటు వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసింది. కూలీలు నాట్లు వేస్తున్న ప్రాంతంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో మహిళా కూలీ గంజాల కొండలమ్మ పొలంలోనే కుప్పకూలింది. మరో ఇద్దరు మహిళా కూలీలు కూడా స్ప్రహా కొల్పోయారు. వారిని వెంటనే అవనిగడ్డలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కొండలమ్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.