అమరావతి: టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్, లీప్ మొబైల్ యాప్‌లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 9552300009 నంబరుకు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో పొందవచ్చు.
ఈ సంవత్సరం, 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు, 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉంది. 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి 28, 2025 వరకు జరుగుతాయి.