అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. క్వాంటమ్ వ్యాలీలో ప్రధాన భాగస్వామి IBM ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే క్వాంటమ్ వ్యాలీ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. క్వాంటమ్ వ్యాలీలో భాగంగానే డీప్ టెక్ రీసర్చ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా జపాన్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ టోక్యో.. అమెరికాకు చెందిన PURDUE యూనివర్శిటీ భాగస్వామ్యంతో డీప్ టెక్ రీసర్చ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీలో దాదాపు 750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారు.