ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా...బ్యారికేడ్లను తోసివేసి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఆయనకు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్‌లో ఉన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గుంటూరు మొబైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ అనంతరం ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.