అమరావతి: రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ,ఆసియా అభివృధి బ్యాంక్ రూ.15 వేల కోట్లు మేర రుణం ఇవ్వగా..హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు రుణం లభించింది. ఇప్పటికే రూ.26 వేల కోట్ల నిధులను రుణం రూపంలో CRDA తీసుకుంది. ఇప్పుడు మరో రూ .32,500 వేల కోట్లు రుణం పొందనుంది.
మరో సారి 1.6 బిలియన్ డాలర్లు.(రూ.14 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వరల్డ్ బ్యాంక్, ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ ముందుకు వచ్చింది. NABFID రూ.10 వేల కోట్లు..నాబార్డ్ రూ.7 వేల కోట్లు మేర రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
మరో వైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.91,639 కోట్ల అంచనాలతో 112 పనులు చేపట్టేలా సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం సమకూరుతున్న నిధులతో మరికొన్ని దేశీయ బ్యాంకులతో కూడా సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతుంది.