అమరావతి: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఎల్లుండి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 25 వరకు తమిళనాడు, పుదుచ్చేరికి వర్ష సూచన ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.