Andrapradesh: రాష్ట్రంలో మరోసారి కుటుంబ సర్వే..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
Andrapradesh: రాష్ట్రంలో మరోసారి కుటుంబ సర్వే..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలను ప్రభుత్వ రికార్డులలో కచ్చితంగా నమోదు చేసేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. కాగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని రికార్లను అప్‌డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలకు నిజమైన అర్హులను గుర్తిస్తారు. ప్రభుత్వ కచ్చిత డేటా రూపొందండ సహా పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. కాగా ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. దీంతో సమాచారం కచ్చితంగా నమోదు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా సాగేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.