అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా అమరావతిలో ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు 1.6 బిలియన్ డాలర్ల రుణాన్ని ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 11 వేల కోట్ల రూపాయల రుణాన్ని హడ్కో ఇస్తోంది.
అయితే అదనపు రుణం మంజూరైతే అందుబాటులోకి మొత్తం 40 వేల కోట్ల రూపాయలు రాజధాని కోసం ఖర్చు చేసినట్లు అవుతోంది. మొత్తం 88 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో వివిధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికి 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింఇవి. కాగా అమరావతిలో పలు ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పీవీ ఏర్పాటు చేయనుంది.