దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారు..జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్

దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారని వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

By Knakam Karthik
Published on : 29 Jan 2025 4:15 PM IST

Andrapradesh, Minister Parthasaradi Fires on Jagan, Ysrcp,Tdp

దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారు..జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్

దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారని వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేసి, అమరావతిని పడుకోబెట్టారంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బూతులు తిట్టి దాని ప్రతిష్టను దిగజార్చింది జగన్ ప్రభుత్వమే అని ఫైర్ అయ్యారు.

ప్యాలెస్‌లో ఫిడేలు వాయించుకున్న వ్యక్తి జగన్ అని, బటన్ నొక్కినందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారని అన్నారు. వందల సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించింది, బీపీసీఎల్ రిఫైనరీ, ఎన్టీపీసీ లాంటి భారీ పెట్టుబడులు సాధించిందని అన్నారు. జగన్ హయాంలో కేవలం స్థలం ఇవ్వకపోవడం కారణంగానే విశాఖకు రైల్వే జోన్ రాలేదని మంత్రి పార్థసారధి ఆరోపించారు.

వైసీపీ తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా ఎదురుదాడి చేసేలా ప్రవర్తిస్తోందని మంత్రి పార్థసారధి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. యుద్ధాలతోనో, క్షామం వల్లో, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏపీ దెబ్బతింటే అర్థం చేసుకోవచ్చని, కానీ కేవలం జగన్ మూర్ఖత్వం కారణంగానే రాష్ట్రం నష్టం పోయిందని, పూర్తిగా ధ్వంసమైందని ఆరోపించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో సిగ్గుపడాల్సింది జగన్ అంటూ విమర్శలు చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

Next Story