రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అంద‌చేసేందుకు తొలి విడ‌త‌గా ఇప్ప‌టికే 7 వేల రూపాయ‌ల‌ను రైతుల‌కు జ‌మ చేసామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

By Medi Samrat
Published on : 4 Sept 2025 5:05 PM IST

రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అంద‌చేసేందుకు తొలి విడ‌త‌గా ఇప్ప‌టికే 7 వేల రూపాయ‌ల‌ను రైతుల‌కు జ‌మ చేసామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగి ఉండి కూడా ఈ పథకం లబ్ది పొందని రైతుల కోసం ఆగష్టు 3 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ పోర్టల్ లోని గ్రీవెన్స్ మోడ్యూల్ అందుబాటులో ఉంచడం జరిగిందని, సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ లు రైతుల ఫిర్యాదులు పోర్టల్ లో ప‌రిచార‌ని తెలిపారు. ఈ ఫిర్యాదులన్నింటిని అన్నదాత సుఖీభవ మార్గదర్శకాల ప్రకారం అర్హతా ప్రామాణికాలతో రాష్ట్ర స్థాయిలో ధ్రువీకరణ చేయగా 36,722 మంది అర్హులు గా గుర్తించామ‌ని తెలిపారు. అర్హులయ్యుండి e –KYC లేక , రైతుల బ్యాంకు అకౌంట్ కి NPCI ACTIVATION లేని కారణంగా కొంతమంది రైతులకు ఈ పథకం లబ్ది అందలేదని, అలాంటి రైతులలో ప్రస్తుతం e-KYC చేయించుకున్న వారికి అలాగే NPCI ACTIVATION చేయించుకున్న వారికి, ఫిర్యాదుల ధృవీకరణలో అర్హతపొందిన రైతులతో కలిపి మొత్తం 47,161 మందికి నేడు మొదటి విడత లబ్ది రూ. 5000/- రూపాయ‌ల‌ చొప్పున మొత్తం 23.58 కోట్లు విడుదల చేయడం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Next Story