ఏపీలో అంగన్వాడీల తొలగింపు ఆదేశాలు సరికాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 10:40 AM GMT
anganwadis, andhra pradesh, pawan kalyan, chandrababu, cm jagan,

ఏపీలో అంగన్వాడీల తొలగింపు ఆదేశాలు సరికాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వేతనాలు పెంచాలంటూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు విరమించాలని పలుమార్లు చెప్పింది. కానీ.. అంగన్వాడీలు ఎక్కడా తగ్గలేదు. దాంతో.. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. అయినప్పటికీ విధులకు వారు హాజరుకాలేదు. దాంతో.. అంగన్వాడీల తీరుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వాటిని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. పలు చోట్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించారు కూడా. మిగతా చోట్ల కూడా తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీలో అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో భాగంగా ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇక అక్కడ దీక్షలు చేస్తున్న వారిని తొలగించేందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వివిధ చోట్ల నుంచి విజయవాడకు వస్తోన్న వారిని కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న తీరు సరికాదని మండిపడుతున్నారు.

తాజాగా అంగన్వాడీల అంశంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశౄలు ఇవ్వడం సరికాదు అని అన్నారు. అలాగే పోలీసు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం జగన్‌కు కోటి సంతకాలతో వినతిపత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి’’ అని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఇదే అంశంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల హామీలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు దిగడం దారుణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చెప్పారు. ఇలా అణచివేయడం.. అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్చిన్నం చేయడం కంటే పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చేదని చంద్రబాబు అన్నారు. ఇకనైనా అహాన్ని పక్కనపెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Next Story