Video : వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్‌బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
By Knakam Karthik
Video: అలా చేస్తే రెడ్‌బుక్‌లో పేరు కన్ఫామ్..వైసీపీ నాయకులకు లోకేశ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్‌బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది. వారు పని చేయరు, చేస్తున్న వారిని చేయనివ్వరు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సమస్యలు వస్తాయని వైసీపీ అపోహలు కల్పిస్తోంది. రండి ప్లాంట్‌ను సందర్శించి, మీ నాయకుడికి చెప్పండి. 10 నెలల్లోనే ఎవరూ చేయని విధంగా ప్రకాశం జిల్లాకు ఈ ప్లాంట్‌ను తీసుకొచ్చా. అంతేకానీ తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని..అని నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో రూ.139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటుకు బుధవారం మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ. 65వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్‌లను ఏర్పాటు చేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది.