ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ..స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్‌ను కొనియాడిన సీఎం
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
By - Knakam Karthik |
ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ..స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్‌ను కొనియాడిన సీఎం
అమరావతి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా.. మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా.. మన్యం జిల్లా చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా.. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా.. తిరుపతి జిల్లా చెందిన చిన్మయి, స్పీకర్‌గా..కాకినాడ జిల్లా చెందిన స్వాతి వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో ప్రధానంగా సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్స్ పై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 45,000 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారంగా చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడి.ఒలింపిక్స్ చర్చపై 'అధికార' మరియు 'ప్రతిపక్ష' వర్గాల మధ్య డిబేట్.#APMockAssembly pic.twitter.com/xPCcsKlSzd
— Gulte (@GulteOfficial) November 26, 2025
మీ కాన్ఫిడెన్స్‌కు అభినందనలు: సీఎం
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..మాక్ అసెంబ్లీ లో విద్యార్థులు పెర్ఫామెన్స్ బావుంది. రాజ్యాంగ దినోత్సవం ఒక బాద్యత. ప్రతి ఒక్కరి లో చైతన్యం రావాలి. మంత్రి లోకేష్. కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం లో అనేక మంచి విషయాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వస్తే అధికారులను కంట్రోల్ చేస్తే శక్తి వస్తుందని ఆలోచించా, విజన్ ఉంటే సరిపోదు...నిరంతరం శ్రమించాలి. ప్రతి ఒక్కరికి సంక్షోభం వస్తుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి.. నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యే అయ్యాను. స్పీకర్ ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. నేను 30 ఏళ్లకే మంత్రి అయ్యాను 45 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యా. అతి చిన్న వయసులోనే. పిల్లలు..ఎమ్మెల్యే పాత్ర సమర్ధవంతంగా పోషించారు. చాలా కాన్ఫిడెన్స్ తో విద్యార్థులు.. అసెంబ్లీ నిర్వహించారు. మీ కాన్ఫిడెన్స్ కు అభినందనలు..అని సీఎం చంద్రబాబు విద్యార్థులను కొనియాడారు.