ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్

ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on  5 March 2025 10:42 AM IST
Andrapradesh, Ap Assembly, Assembly Speaker Ayyannapatrudu, YS Jagan, Tdp, ysrcp

ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్

ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని చురక అంటించారు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్నానని చెప్పారు. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అంటే కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసీ జగన్ చేసిన ప్రేలాపనలను స్పీకర్ హోదాలో క్షమించి వదిలేస్తున్నా. అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులతో జగన్ నాకు గత ఏడాది జూన్ 24న లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

Next Story