ఉచిత గ్యాస్ సిలిండర్.. కావాల్సిన కార్డులు ఇవే
ఈ నెల ఆఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 27 Oct 2024 6:27 AM ISTఉచిత గ్యాస్ సిలిండర్.. కావాల్సిన కార్డులు ఇవే
అమరావతి: ఈ నెల ఆఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా నిర్ణయిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. తొలుత పూర్తిగా డబ్బులు చెల్లిస్తే.. రెండు రోజుల తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో తిరిగి డబ్బును జమ చేస్తుంది. అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు మొదటి సిలిండర్ పంపిణీకి ఖర్చు అయ్యే రూ.895 కోట్లను చెక్కు రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఎవరికైనా ఈ పథకం అందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించింది. మొదటి గ్యాస్ సిలిండర్ ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. రెండవ సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జూలై 30, మూడవ సిలిండర్ ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఎంఎస్ వెళ్తుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సలిండర్ సరఫరా అవుతుందన్నారు. డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమ అవుతుందని తెలిపారు.