ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాట్ టికెట్లను విద్యాశాఖ మధ్యాహ్నం రిలీజ్ చేసింది. https://bse.ap.gov.in/ వెబ్సై ట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) (whatsapp) సర్వీస్ 'మన మిత్ర'లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన ఖాతాలో పోస్టు చేశారు. టెన్త్ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 22వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 24వ తేదీన గణితం, 26వ తేదీన ఫిజికల్ సైన్స్, 28వ తేదీన బయోలాజికల్ సైన్స్, 29వ తేదీన OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ), 31వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి